రేపటి నుంచి బాలల నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బాలల నాటిక పోటీలు

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

నయీంనగర్‌ : ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ వరంగల్‌ స్వర్ణో త్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ నెల 12, 13, 14 తేదీల్లో హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో బాలల నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు క్లబ్‌ ఫౌండర్‌ సెక్రటరీ నేరెళ్ల శోభావతి తెలిపారు. మంగళవారం గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 8 అంశాల్లో నాటిక పోటీలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో వనం లక్ష్మీకాంత్‌, జెపి.శైలజ, హరిత, సబిత, అర్చన పాల్గొన్నారు.

బాలికను మోసగించిన యువకుడు

● కేసు నమోదు

తొర్రూరు రూరల్‌ : ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని ఓ తండాకు చెందిన 17 ఏళ్ల బాలికను ఇదే మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. మూడేళ్ల పాటు బాలికతో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలో ఇటీవల సదరు బాలిక గర్భం దాల్చగా ఆ యువకుడు మాయ మాటలు చెప్పి అబార్షన్‌ మాత్రలు ఇచ్చాడు. దీంతో తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావం కావడంతో బాధిత బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. దీంతో కోపోద్రిక్తులైన బాధిత బాలిక కుటుంబీకులు యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు పూనుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపారు.

అప్పుల బాధతో

యువకుడి ఆత్మహత్య

● కట్టయ్యపల్లిలో ఘటన

చెన్నారావుపేట:అప్పుల బాధతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మంగళవారం వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్‌చెడ గ్రామ శివారు కట్టయ్యపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టయ్యపల్లికి చెందిన సూర తిరుపతి(37) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఆటోకు సరైన కిరాయి రాక అప్పులు ఎక్కువయ్యాయి. ఆ అప్పులు తీర్చడానికి ఇల్లు తనఖా పెట్టి లోన్‌ తీసుకున్నాడు. ఆ రుణం సైతం సకాలంలో తీర్చకపోవడంతో ఇల్లు తిరుపతి చేజారి పోయింది. దీంతో నిల్వ నీడలేకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం తెల్లవారు జామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య , కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్‌ తెలిపారు.

చికిత్స పొందుతున్న

మహిళా ఉద్యోగి మృతి

● లారీ డ్రైవర్‌పై కేసు నమోదు

ఖిలా వరంగల్‌ : వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుత్వ ఉద్యోగిని మగ్గిడి అనురాధ (57) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ అమ్మవారిపేట సమీపంలోని కొత్తపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అనురాధ (57) ఈనెల 7న సాయంత్రం నగరంలోని ఓ కార్యాలయంలో విధులు ముగిసిన తర్వాత కుమారుడు వరుణ్‌ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఉర్సుగుట్ట సమీపాన అమ్మవారిపేటకు వెళ్లే దారిలో రోడ్డుపై పార్క్‌ చేసి ఉన్న లారీని బైక్‌ బలంగా ఽఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఎంజీఎం తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం అనురాధ మృతిచెందింది. వరుణ్‌ చికిత్స పొందుతున్నాడు. బాధితురాలి బంధువు శేషాద్రి ప్రసన్నకుమార్‌ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement