‘వీర్‌గాథ’లో జనగామ సత్తా | - | Sakshi
Sakshi News home page

‘వీర్‌గాథ’లో జనగామ సత్తా

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

మరింత గుర్తింపు తీసుకువచ్చేలా

జనగామ: విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశసేవా భావం పెంపొందించడంతోపాటు వారి సృజనాత్మకకు పదును పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వీర్‌ గాథ 6.0 కార్యక్రమంలో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది. కేవలం పోటీల్లో పాల్గొనడమే కాకుండా విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడంలోనూ జిల్లా ముందడుగు వేస్తోంది. నవంబర్‌ 7 నాటి గణాంకాల ప్రకారం 128 సబ్మిషన్లు, 113 ఎంట్రీలతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, 47 రిజిస్ట్రేషన్లతో పాటు 1,351 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో ద్వితీయ స్థానం దక్కించుకుంది. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమంలోని ప్రధాన అంశం. గ్యాలంట్రీ అవార్డు గ్రహీతల ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, అంకితభావం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయి. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, దేశ రక్షణలో సైనికుల పాత్రను తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతోంది.

సృజనాత్మకతకు జాతీయ స్ఫూర్తి

3 నుంచి 12వ తరగతి వరకు నాలుగు కేటగిరీల్లో కవితా రచన, వ్యాసరచన, చిత్రలేఖనం, పెయింటింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. రాణి లక్ష్మీబాయి స్ఫూర్తి, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం, గిరిజన తిరుగుబాట్లు, గ్యాలంట్రీ అవార్డు విజేతల జీవితగాథలు వంటి అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలు ఆవిష్కరించొచ్చు. ఈ నెల 12లోగా పాఠశాల స్థాయిలో పోటీలు పూర్తి చేసి, ప్రతీ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన వారి ఎంట్రీలను MyGov పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వం, ఆత్మవిశ్వాసం, పరిశోధనాత్మక దృక్పథం, సామాజిక బాధ్యత పెంపొందుతాయి.

రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా సాధించిన ప్రగతిని మరింత పెంచాలి. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థుల భాగస్వామ్యాన్ని విస్తృతం చే యాలి. పోటీల నిర్వహణ, ఎంట్రీల అప్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా చూడాలి. వీర్‌ గాథ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, త్యాగనిరతిని పెంపొందిస్తాయి. అన్ని విభాగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జనగామకు మరింత గుర్తింపు తీసుకురావాలి.

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌, జనగామ

సబ్మిషన్లు, ఎంట్రీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

విద్యార్థుల భాగస్వామ్యంలో

ద్వితీయ స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement