● మేడిగడ్డ వద్ద 9,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. సోమవారం బ్యారేజీకి 9,170 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం బ్యారేజీలోని 85 గేట్లు తెరిచి ఉంచడంతో గోదావరి నదిలో వరద ఫ్రీ ఫ్లోలో కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కూడా రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
భర్త మందలించాడని
భార్య ఆత్మహత్య
● ఐనవోలులో ఘటన
ఐనవోలు: ఇంట్లో పనులు చేయకుండా ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకుని ఆత్మహ్యతకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకా రం.. బిహార్‌లోని నలంద జిల్లా మహత్వాన్ గ్రామానికి చెందిన గౌతమ్ పాశ్వాన్, రాధాకుమారి(20) దంపతులు సుమారు నాలుగేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మండల కేంద్రానికి వచ్చారు. గౌతమ్ పాశ్వాన్ ప్రస్తుతం వివిధ యజమానుల వద్ద హమాలీ, కూలీ పనులకు వెళ్తున్నాడు. ఆదివారం సాయంత్రం గౌతమ్ పాశ్వాన్ కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రాధాకుమారి ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఇంట్లో పనులు చేయకుండా ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాధాకుమారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి భర్త గౌతమ్ పాశ్వాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్షణికావేశంలో జాటోత్
తండాలో యువకుడు..
సంగెం: భార్యతో గొడవ పడి క్షణికావేశంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డా డు. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నర్సానగర్ శివారు జాటో త్ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం అడవి రంగాపురం శివారు గోబ్రియతండాకు చెందిన లావుడ్య వెంకన్న(35)కు సంగెం మండలం నర్సానగర్ శివారు జాటోత్ తండాకు చెందిన అఖిలతో వివాహం జరిగింది. వివాహ అనంతరం వెంకన్న ఇల్లరికం వచ్చి జాటోత్ తండాలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి లావుడ్య బీది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మృతుడికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.


