కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పరిశీలనకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నెల 15 వతేదీ వరకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ఉన్నతాధికారులతో విచ్చేసి ఆస్పత్రిని పరిశీలించారు. దసరా పండుగ రోజు లాంఛనంగా ఓపీ సేవలు ప్రారంభిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చ లేదు. దీనికి కారణాలేమైనా విజయదశమి రోజు ఓసీ సేవలకు ముహూర్తం ఫలించలేదు. దీంతో మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచారు. ఎల్ అండ్ టీ కంపెనీ, ఆర్ అండ్ బీ అఽఽధికారులు, సీఎంఓ అధికారులు, గ్రూప్–1 అధికారుల బృందంతో పాటు ఎంజీఎం అధికారులు పనులు వేగవంతం చేశారు. ముఖ్యంగా వరంగల్ కలెక్టర్ సత్యశారద నిత్యం అధికారులు, కంపెనీ అధికారులను అలర్ట్ చేస్తూ నిర్మాణ పనులపై పర్యవేక్షిస్తున్నారు. అలాగే, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కూడా ఆస్పత్రి గ్రౌండ్‌లో ఏర్పాట్లు చురుగ్గా జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంజీఎంకు సంబంధించిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని ‘సూపర్’కు పిలుస్తూ ట్రయల్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓపీ సేవలు ప్రారంభమైతే తీసుకోవాల్సిన పనులు సత్వరంగా పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రౌండ్‌తో పాటు ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వరకు పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. వాషింగ్ రూమ్స్ పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది.
15న వైద్యారోగ్య శాఖ మంత్రి పర్యటన?
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 15న వరంగల్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించలేదు. ఇద్దరు మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేసినప్పటికీ సంబంధిత శాఖ మంత్రి రాలేదని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన వరంగల్ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పనులు, ఏర్పాట్ల గురించి ము ఖ్యమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. అలా గే, ఈ నెల 20 వరకు ఓపీ సేవలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు,
ప్రొఫెసర్ల నియామకాలు..
ఇప్పటికే అధికారులు కాంట్రాక్టు పద్ధతిపై సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అదనపు ఆర్‌ఎంఓలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకం కోసం కసరత్తు ప్రారంభించారు. కేఎంసీ, ఎంజీఎం పరిఽధిలో నలుగురు 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించారు. కేఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో ప్రొఫెసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే, ఎంజీఎంలో కాంట్రాక్టు పద్ధతిలో 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం ఇంటర్వ్యూ నిర్వహించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పారా మెడికల్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
మంత్రి పర్యటనకు ముందు
‘సూపర్’లో ఓపీ ఏర్పాట్లు అయ్యేనా!
ఈ నెల 20 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు?


