జోడెడ్ల ప్రతిమలతో ప్రదర్శన.. చెరువులో నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

జోడెడ్ల ప్రతిమలతో ప్రదర్శన.. చెరువులో నిమజ్జనం

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

జోడెద్దుల ప్రతిమలతో నేతకాని కులస్తులు

● సీతంపేటలో ప్రత్యేక

దీపావళి బతుకమ్మ

వేడుకలు

● కేదారేశ్వరస్వామి వ్రతం

విరమణ

హసన్‌పర్తి : హనుమకొండ జి ల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో దీపావళి బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీపావళి పర్వదినం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేతకాని కులస్తులు ఆదివారం తొలి రోజుచెరువు నుంచి మట్టిని సేకరించారు. ఆ మట్టితో జోడెడ్ల ప్రతిమలు తయారుచేసి వాటిని ప్రత్యేక గదిలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషులు కేదారేశ్వరస్వామి వ్రతాన్ని ఆచరించారు. సోమవారం రెండో రోజు గదిలో ప్రతిష్టించి జోడడ్ల ప్రతిమలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రదర్శన నిర్వహించి స్థానిక చెరువులో జోడెడ్ల ప్రతిమలను నిమజ్జనం చేశారు. అనంతరం కేదారేశ్వర వ్రతాన్ని విరమించారు. మాజీ సర్పంచ్‌ శరత్‌, స్థానిక నాయకులు బండారి కుమారస్వామి, గోళ్ల రాజయ్య, గాంధీ, నేతకాని కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement