వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నగరంలోని జేఎన్ఎస్లో ఈనెల 10, 11 తేదీల్లో 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్–14 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ, ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. వాసుదేవరావు సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి క్రీడాకారుల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొననున్నారని వివరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలకు తెలంగాణ జట్టు ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.


