సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇళ్లు

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

● ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌

మహబూబాబాద్‌: పేదల సొంతింటి కల నెరవేర్చడానికే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులోని బేతోల్‌ గ్రామంలో ఆదివారం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా గృహ ప్రవేశంలో పాల్గొని బాణసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. అనంతరం 36వ వార్డు పరిధిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.

మరిపెడలో..

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మా ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి సంబురాల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్‌ పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి బాణసంచా కాల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించే ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కాలం సునీత రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు నీలాలచ్చిరాం, కుమార్‌, పాష, జానీమియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement