● ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్
రాంచంద్రునాయక్
కురవి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కందికొండ గ్రామ శివారు కందగిరి పర్వతంపై జరగబోయే శ్రీలక్ష్మీనర్సింహాస్వామి జాతరను వైభవంగా జరిపేందుకు కృషి చేస్తామని, కందికొండ గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం కందికొండ శివారు కందగిరి పర్వతం వద్ద ఈనెల 24న కార్తీక పౌర్ణమి రోజున జరగబోయే లక్ష్మీనర్సింహాస్వామి జాతరను విజయవంతం చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు గుట్టను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ పురావస్తు శాఖ, పర్యాటక శాఖ, అటవీ శాఖలతో సమన్వయం చేసి గుట్టపైకి చేరేందుకు రోప్‌వే కోసం ప్రతిపాదనల పంపించామని, రూ.5కోట్లతో గుట్టపై ఉన్న పురాతన ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నారు. అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచ్ తొడుసు నాగా ర్జున, ఎంపీడీఓ వీరబాబు, తహసీల్దార్లు పున్నంచందర్, విజయ, రవీందర్‌రెడ్డి, సుధాకర్, బాలగాని శ్రీనివాస్, గార్లపాటి వెంకటరెడ్డి, వీరభద్రం, వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


