● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సంబంధిత అదికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినతులపై సంబంధిత అఽధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందించాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 56 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. దీపావళి పండుగ కారణంగా వినతుల సంఖ్య తగ్గాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో నాగలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


