పండుగ పూట జర పైలం | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట జర పైలం

Nov 8 2026 5:05 AM | Updated on Nov 8 2026 5:05 AM

షాపుల నిర్వాహకులు

ఈ నిబంధనలు పాటించాలి

కాశిబుగ్గ: దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజలు తప్పసరిగా జాగ్రత్తలు పా టించాలని జిల్లా ఫైర్‌ ఆఫీ సర్‌ యజ్ఞ నారాయణ తెలి పారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఇబ్బందులు తప్పవని, టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండుగ సంతోషంగా జరుపుకోవాలంటే జాగ్రత్తలు పాటించకతప్పవని పేర్కొన్నారు. కాగా, టపాసుల దుకాణాల ఏర్పాటుకు జిల్లా వ్యాప్తంగా 75 మంది దరఖాస్తు చేసుకోగా, 69 షాపులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ప్రమాదాలు జరిగితే...

ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే సమాచారం అందించాలని జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ తెలిపారు. పోలీసు 101, వరంగల్‌ ఫైర్‌ స్టేషన్‌ 87126 99303, నర్సంపేట 87126 99309, వర్ధన్నపేట 87126 99311, గొర్రెకుంట 87126 99313 సెల్‌నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు.

టపాసుల షాపులను ఖాళీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకోవాలి.

షాపుల మధ్య మూడు మీటర్ల దూరం పాటించాలి.

ప్రతీ షాపులో అగ్ని నివారణ పరికరాలు, నీటిని నిల్వ ఉంచుకోవాలి.

ఇనుప రేకులతో షెడ్డు నిర్మించుకోవాలి.

దుకాణాల్లో విద్యుత్‌ వైర్లు జాయింట్‌ లేకుండా, నాణ్యమైన వైర్లను వాడాలి.

ఇంటి దగ్గర టపాసులు కాల్చేటప్పుడు ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి.

అధికారుల అనుమతి మేరకు టపాసుల స్టాక్‌ నిల్వ చేసుకోవాలి.

టపాసుల షాపులు ఎదురెదురుగా ఉండకూడదు.

టపాసుల షాపునకు కనీసం 50 మీటర్ల దూరంలో బాణసంచా కాల్చాలి.

పిల్లలు టపాసులు కాల్చుతున్నప్పుడు పెద్దలు పర్యవేక్షణ ఉండాలి.

చేతులు, కండ్ల రక్షణకు గ్లౌజులు, కాటన్‌ దుస్తులు ధరించాలి.

నీటిని అందుబాటులో

ఉంచుకోవాలి.

దీపావళి నేపథ్యంతో విరివిగా వెలిసిన టపాసుల షాపులు

జాగ్రత్తలు పాటించాలంటున్న అగ్నిమాపక శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement