భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం తండాకు చెందిన అజ్మీరా చందు (36) హత్య కేసులో నిందితులు భార్యతోపాటు ప్రియుడు సంతోష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం భూపాలపలి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చందు హత్య ఘటనపై మృతుడి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సంతోశ్, మృతుడి భార్య బైక్‌పై వెళ్తుండగా మల్లంపల్లి క్రాస్ వద్ద పోలీసులు పట్టుకుని విచారించగా చందును హత్య చేసినట్లు నేరం అంగీకరించారు. ఆరు నెలల నుంచి మృతుడి భార్య.. గుగులోత్ సంతోష్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ విషయంపై గురువారం రాత్రి చందు దంపతులు గొడవ పడ్డారు. దీంతో మృతుడి భార్య.. సంతోష్‌కు ఫోన్ చేసి పిలువగా అతడు గొడ్డలితో వచ్చాడు. ఈ సమయంలో వెనుక గదిలో నిద్రిస్తున్న చందును అతడి భార్య గుడ్డతో నోరుమూయగా, సంతోష్ గొడ్డలితో తలపై మోదాడు. దీంతో చందు మృతి చెందగా సంతోష్ తన ఇంటికెళ్లి ఎడ్లబండితో పాటు గోనె సంచి తీసుకొచ్చాడు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసి జే వైర్‌తో కుట్టి ఎడ్లబండిపై తీసుకుని గొల్లబుద్ధారం శివారు రోడ్డు పక్కన పొలాల్లో వేశారు. బయపడి ఇద్దరు బైక్‌పై హనుమకొండకు వెళ్లి తిరిగి వచ్చారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మల్లంపల్లి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్సైలు పవన్‌కుమార్, గీత, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు


