‘అన్‌మ్యాన్డ్‌’కు ఆరోగ్య బీమా.. | - | Sakshi
Sakshi News home page

‘అన్‌మ్యాన్డ్‌’కు ఆరోగ్య బీమా..

Nov 8 2026 5:05 AM | Updated on Nov 8 2026 5:05 AM

హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్‌లో విధులు నిర్వర్తిస్తున్న అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లు, వారి కుటుంబ సభ్యులకు ఆర్యోగ్య బీమా సౌకర్యం కల్పించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెమో జారీ చేసింది. సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్లకు ఇటీవల రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం.. అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్మికులకు సంక్షేమ కార్యక్రమం అమలుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో రూ.10 లక్షల గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 1,450 మంది వర్కర్లు..

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 1,450 మంది వరకు అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా ద్వారా భద్రత కల్పించింది. దీని ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయం పొందే అవకాశం కలిగింది. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యుత్‌ లైన్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విధులు నిర్వర్తించే కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ వరుణ్‌ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25,024 ప్రీమియం

ఈ బీమా పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25, 024 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల బీమా రక్షణ కల్పించనున్నారు. ఈ సౌకర్యం కార్మికులతోపాటు వారి భార్య లేదా భర్త, పిల్లలకు వర్తించనుంది. ఈ మేరకు అన్ని డివిజన్ల డివిజనల్‌ ఇంజినీర్లు, ఆపరేషన్‌ అధికారులకు సంస్థ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత మ్యాన్‌పవర్‌ ఏజెన్సీల నుంచి ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన ప్రొఫార్మా ఇన్వాయిస్‌లు సేకరించి, అవసరమైన ఆర్థిక ప్రక్రియ పూర్తి చేయాలని యాజమాన్యం సూచించింది.

ఒక్కో కార్మికుడితోపాటు కుటుంబీకులకు

రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌

మెమో జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement