మేడారం వెళ్లొస్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

మేడారం వెళ్లొస్తూ మృత్యుఒడికి..

Nov 8 2026 5:05 AM | Updated on Nov 8 2026 5:05 AM

రేగొండ: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్థిపేట క్రాస్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గౌస్‌పల్లి గ్రామానికి చెందిన గణేశ్‌, అమరేందర్‌, మహేశ్‌, సాయి ఆటోలో ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారం వెళ్లారు. తల్లుల దర్శన అనంతరం తిరిగొస్తున్న క్రమంలో భాగిర్థి పేట క్రాస్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. గమనించిన స్థానికులు 108లో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో సాయి (28), పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమరేందర్‌ (32) మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రుడు గణేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో

ఇద్దరి మృతి..

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

భాగిర్థిపేట క్రాస్‌ వద్ద ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement