కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఈన్‌టీ అసోసియేషన్ ఆఫ్ ఓటోలారింగాల జిస్టస్ ఆఫ్ ఇండియా (ఎఓఐ) వరంగల్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెల 13న నిర్వహించనున్న ‘ఈన్‌టీ సీఎంఈ–2026’ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. శనివారం కేఎంసీ ప్రిన్సిపాల్ డి.మోహన్‌దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎస్.రమేశ్‌కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కేఎంసీ ఆడిటోరియంలో జరగనున్న సీఎంఈ ప్రోగ్రాంలో ఈన్‌టీ విద్యార్థులు, పీజీ వైద్యులు, కన్సల్టెంట్లకు ఆధునిక వైద్య పరిజ్ఞానం, శస్త్ర చికిత్సా నైపుణ్యాలపై నిపుణులతో శిక్షణ, శాసీ్త్రయ చర్చలు నిర్వహిస్తామని ఆర్గనైజర్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్లు డి.సత్యనారాయణ, రవికుమార్, ఏఓఈ జనరల్ సెక్రటరీ సుదీప్, కోశాధికారి సోమ శ్రీధర్, ఈన్‌టీ విభాగాధిపతి సంపత్‌రావు, ప్రొఫెసర్ బి.విజయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాజేంద్రప్రసాద్, ప్రత్యూష, హుమేరియా ఫాతిమా,తదితరులు పాల్గొన్నారు.
యువకుడికి దేహశుద్ధి
జనగామ : జిల్లా కేంద్రం ముస్లిం మైనారిటీ కాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ధర్మకంచకు చెందిన ఓ యువకుడికి శనివారం దేహశుద్ధి చేశారు. ఓ వివాహితతో సంబంధం ఉన్నట్లు గుర్తించి, యువకుడిని పట్టుకుని కాలనీలోని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుడిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కాగా, యువకుడిపై దాడికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని బాధితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
పోస్టర్లను ఆవిష్కరించిన వైద్యాధికారులు, ఈన్‌టీ వైద్యులు


