భారీవర్షం.. నీట మునిగిన పంటలు | - | Sakshi
Sakshi News home page

భారీవర్షం.. నీట మునిగిన పంటలు

Nov 8 2026 4:59 AM | Updated on Nov 8 2026 4:59 AM

కురవి: మండలంలోని మోద్గూలగూడెం, బలపాల, రాజోలు, నల్లెల, సూర్యతండా జీపీ, తులిస్యాతండా జీపీలతోపాటు గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పత్తి, మిర్చి పంటలు నీటమునిగాయి. శనివారం రైతులు పంటచేల వద్దకు వెళ్లి చూడటంతో పంటలన్ని నీటిలో మునిగిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. పత్తి, మిర్చి చేలల్లో నిల్వ ఉన్న వరద నీటిని బయటకు పంపించేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. మోద్గూలగూడెం గ్రామానికి చెందిన కొత్త మల్లేశానికి చెందిన ఎకరం మిర్చి తోట, సూర్యతండాకు చెందిన తేజావత్‌ మోతిలాల్‌, తేజావత్‌ ప్రేమ్‌కుమార్‌, తేజావత్‌ లక్ష్మీలకు చెందిన ఎకరం చొప్పున మిర్చి తోటలు నీట మునిగిపోయాయి. అలాగే మోద్గూలగూడెం గ్రామానికి చెందిన కొత్త నాగరాజు, కొత్త ఐలయ్య, మల్లయ్య, వెంకన్న, అనబత్తుల నాగయ్య పంటలు సైతం నీటిలో మునిగిపోయాయి. అయితే కురవి–ఖమ్మం వెళ్లే 365/ఏ జాతీయ రహదారి పనుల్లో భాగంగా ఆయా గ్రామాల సమీపంలో మోరిని పూడ్చివేయడమే ఈ వరదకు కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులు పూడ్చిన మోరీని తవ్వేందుకు ప్రయత్నంచేశారు. అనంతరం రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.

మోరీ పూడ్చడంతో పంటచేలల్లోకి వరద

ఆందోళనకు దిగిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement