జిల్లాల పనితీరు మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాల పనితీరు మెరుగుపడాలి

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

● వీసీలో సీఎస్‌ సంజయ్‌జాజు

మహబూబాబాద్‌: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం సీఎస్‌ సంజయ్‌జాజు అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పింఛన్ల వెరిఫికేషన్‌, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. జనవరి మొదటి వారంలోగా సమగ్ర శిక్ష, పీఎం శ్రీనిధుల వినియోగం వందశాతానికి చేరాలన్నారు. మార్చి చివరి వరకు వీబీజీ రామ్‌జీ ద్వారా 12 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యం సాధించాలన్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి లబ్ధిదారులకు ఉచిత ఇసుక, రాయితీ సిమెంట్‌ అందించాలన్నారు. మన ఇసుక–మన వాహనం యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఒక్కో సిమెంట్‌ బస్తాను రూ.230 చొప్పున లబ్ధిదారులకు సరఫరా చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement