నియామకంపై ఆందోళన! | - | Sakshi
Sakshi News home page

నియామకంపై ఆందోళన!

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాల భర్తీలో

గందరగోళం

● మెరిట్‌, రోస్టర్‌ ప్రక్రియపై స్పష్టత కరువు

● భారీ సంఖ్యలో అభ్యర్థుల దరఖాస్తులు

సాక్షి, మహబూబాబాద్‌ : జిల్లా వైద్యారోగ్యశాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో ఇటీవల పోస్టుల భర్తీకి విడుదల చేసిన నియామక ప్రకటన గందరగోళంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నియామకంలో మెరిట్‌, రోస్టర్‌ ప్రక్రియపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో తాము అర్హులమో కాదో తెలియకుండానే నిరుద్యోగులు వందలాది రూపాయలు ఖర్చుచేసి, రెండు, మూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. ముందే రోస్టర్‌ ప్రకటిస్తే ఏ ఉద్యోగానికి అర్హత ఉంటుందో.. దేనికి ఉండదో తెలుసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, అర్హత లేని ఉద్యోగానికి హడావుడి చేసినట్లు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పష్టత కరువు..

వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీకోసం ప్రకటన చేసిన అధికారులు అందులో మెరిట్‌, రోస్టర్‌ విధానంపై స్పష్టత ఇవ్వలేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి ప్రకటించిన ప్రకటన ప్రకారం పోస్టుకు సంబంధించిన కోర్సులు పూర్తి చేయాలి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సదరు సర్టిఫికెట్‌ రిజిస్టేషన్‌ చేయించుకోవాలి. కోర్సు పాస్‌ అయిన నాటి నుంచి సంవత్సరానికి 0.5శాతం చొప్పున గరిష్టంగా 10శాతం మార్కులు కలుపుతామని ప్రకటించారు. అదే విధంగా మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక ఉంటుందని అన్నారు. అయితే గతంలో నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్‌ కేటాయింపులు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన రోస్టర్‌ను అనుసరించారు. అయితే ఇప్పుడు ఈ రోస్టర్‌పై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఏ పోస్టు ఎవరికి కేటాయిస్తారో.. ఎలా భర్తీ చేస్తారో అనే గందరగోళం నెలకొంది.

వర్తించని పోస్టుకు ఖర్చు..

ఇంతకాలం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు చేసిన అభ్యర్థులు పోస్టులు భర్తీ ప్రకటన రాగానే పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 67 పోస్టులు ఉండగా.. అందులో ఎంఎల్‌హెచ్‌పీలు 34, స్టాఫ్‌ నర్సులు 8, ఏఎన్‌ఎంలు 7మినహా మిగిలిన పోస్టులన్నీ నాలుగుకు మించలేదు. కొన్ని పోస్టులు ఒకటి, రెండు కూడా ఉన్నాయి. ఇటువంటి పోస్టులకు రోస్టర్‌ పద్ధతిలో ఏ రిజర్వేషన్‌ వస్తుందో ముందే తెలిపితే.. ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకునే వారు. కానీ, ఇప్పుడు ఆ స్పష్టత ఇవ్వలేదు. దీంతో రిజర్వేషన్‌, జనరల్‌ తేడా లేకుండా అందరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 67 పోస్టులకు 2,563 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు కోసం రిజర్వుడ్‌ అభ్యర్థులు రూ. 300, జనరల్‌ అభ్యర్థులు రూ.500 చొప్పున డీడీలు చెల్లించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, జిరాక్సులు, దూర ప్రాంతాల నుంచి వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు ఖర్చు అయ్యింది. ఇలా ఒక్కో అభ్యర్థి రూ.800 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేశారు. తమకు వర్తిస్తుందో లేదో తెలియని ఉద్యోగానికి ఇంత ఖర్చు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోస్టులు ఖాళీలు వచ్చిన

దరఖాస్తులు

రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌ 01 12

ల్యాబ్‌ టెక్నీషియన్‌ 04 327

ఎంఎల్‌హెచ్‌పీ 34 409

ఆప్తాలమిక్‌ అసిస్టెంట్‌ 01 36

ఫిజిషియన్‌ 02 30

ఫిజియో థెరపిస్టు 03 71

స్టాఫ్‌ నర్సులు 08 674

ఏఎన్‌ఎం 07 620

ఫార్మసిస్టు 02 220

టీబీ సూపర్‌వైజర్‌ 02 116

పీడియాట్రిషన్‌ 02 14

అకౌంట్‌ ఆఫీసర్‌ 01 34

మొత్తం 67 2,563

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement