మహిళలు, బాలల హక్కుల రక్షణ కీలకం | - | Sakshi
Sakshi News home page

మహిళలు, బాలల హక్కుల రక్షణ కీలకం

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

● జిల్లా జడ్జి కె.మురళీమోహన్‌

మహబూబాబాద్‌ రూరల్‌: సమాజంలో మహిళలు, బాలల హక్కుల రక్షణ అత్యంత కీలకమని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడం మన బాధ్యత అని జిల్లా జడ్జి కె.మురళీమోహన్‌ అన్నారు. వివిధ కేసుల నిమిత్తం, న్యాయ సేవలు కోసం వచ్చే బాలింతలు, తల్లుల సౌకర్యార్థం జిల్లా కోర్టు ఆవరణలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ హబ్‌ (మహిళా సాధికారత కేంద్రం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మదర్‌ ఫీడింగ్‌ కేంద్రం (తల్లిపాల గది)ను శుక్రవారం ప్రారంభించారు. మహిళలు, పిల్లల రక్షణ, భద్రత కోసం అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన అన్ని హెల్ప్‌ లైన్‌ నంబర్లతో కూడిన సమాచార బోర్డును జిల్లా జడ్జి ఆవిష్కరించి మాట్లాడారు. కోర్టు విచారణలు, ఇతర పనుల నిమిత్తం వచ్చే బాలింతలు, తల్లులు తమ పసిబిడ్డలకు ప్రశాంతమైన వాతావరణంలో పాలు పట్టేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతీ బిడ్డకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే హక్కు ఉందని, న్యాయ సేవాధికార సంస్థల చట్టం 1987లోని సెక్షన్‌ 12(సీ) ప్రకారం మహిళలందరికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి షాలిని షాకెళ్లి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ, కోర్టు ముఖ్య పరిపాలన అధికారి శ్రీనివాస్‌, జిల్లా సంక్షేమ అధికారి శిరీష, మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు మహేశ్వరి, అరుణ, సంధ్యారాణి, కృష్ణవేణి, సఖీ కేంద్రం బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement