గాంధీ మార్గంలో గాంధీనాయక్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

గాంధీ మార్గంలో గాంధీనాయక్‌ నిరసన

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

పాలకుర్తి టౌన్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అరగుండు, అర మీసంతో నిరసన తెలిపి చర్చనీయాంశమైన గాంధీనాయక్‌ మరోసారి విస్నూత నిరసనకు శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ఆయన చెప్పులు లేకుండా టోపి, గూలాబీ శాలువ ధరించి, అర్ధనగ్నంగా గాంధీ వేషధారణలో ఆయన మార్గంలో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం పాలకుర్తిలో సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. కేసీఆర్‌ మళ్లీ సీఎంగా.. ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రిగా తొలి సంతకం చేసే వరకు తన నిరసన విరమించబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాయకులు పసునూరి నవీన్‌కుమార్‌, బొబ్బల రమణారెడ్డి, పాము శ్రీనివాస్‌, కమ్మగాని నాగన్న, గుడికుంట తండా సర్పంచ్‌ బానోత్‌ మహేందర్‌ నాయక్‌, రాజు తదితరులు గాంధీనాయక్‌ను సన్మానించి దీక్షకు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement