నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

మత్స్యశాఖపై ఉన్నతాధికారుల ఆరా..

నెహ్రూసెంటర్‌: ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ అనిత అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రిని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ, రోగులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆస్పత్రుల్లో అబార్షన్లు చేయడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement