పంట నష్టం వివరాలు తెలియజేయాలి | - | Sakshi
Sakshi News home page

పంట నష్టం వివరాలు తెలియజేయాలి

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

● డీఏఓ ఎస్‌.విజయచంద్ర

మహబూబాబాద్‌ రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో ఏమైనా పంటనష్టం జరిగితే తెలియజేయాలని డీఏ ఓ విజయచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న వివిధ పథకాలపై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఏఓ మాట్లాడుతూ.. యాసంగిలో పెసర, మినుము, మొక్కజొన్న, నువ్వులు, బొబ్బెర, కుసు మ వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాలన్నారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, ఎన్‌ఎంఈఓ పథకాల ద్వా రా అందజేస్తున్న పెసర, వేరుశనగ, కుసుమ పంటల ప్రదర్శనలు గ్రామాల్లో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, టెక్నికల్‌ ఏఓ రాంజీ, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, డీఏఓ కార్యాలయ పర్యవేక్షకులు శివకుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement