అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: రుణాలు ఇచ్చి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం బ్యాంకర్లు, సంబంధిత అఽధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల్లో అర్హులైన రైతులకు అండగా నిలవాలని సూచించారు. జిల్లాలో ఏడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. రైతులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పూర్తిగా సహకారం అందించాలన్నారు. మండలాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి రైతు వేదికలు, గ్రామ సభల ద్వారా వ్యవసాయ అధికారుల సమన్వయంతో బ్యాంక్‌లు అందిస్తున్న సేవలను రైతులకు వివరించాలన్నారు. గంగారం, కొత్తగూడ మండలాల్లో కమర్షియల్‌ షెడ్యూల్‌ బ్యాంకుల స్థాపనకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలన్నారు.

గడువులోగా పరిష్కరించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, పట్టభద్రుల ఓటరు నమోదుపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 48,887 ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, 22,221 దరఖాస్తులను అమోదించినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీఆర్వో నాగలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement