● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
మహబూబాబాద్: గత సర్కార్ హయాంలో చేపట్టిన అసంపూర్తి పనులు త్వరగా పూర్తి చేయాలని, ముఖ్యంగా మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రం శివారులోని మున్సిపాలిటీ నూతన భవనాన్ని గురువారం ఎమ్మెల్సీ రవీందర్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ.. భవనం పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. కనీస వసతులు లేని భవనంలో పాలక మండలి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ భవనం విషయంలో వారం రోజుల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేని యెడల ధర్నా కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. కబ్జా జరిగిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మానుకోట మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కౌన్సిలర్లు ముత్యం వెంకన్న, చిట్యాల జనార్దన్, నాయకులు గద్దె రవి, రఘు, జెరిపోతుల వెంకన్న, అజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


