గార్ల: గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజ్మీరా ద్రాక్షవేణి అనే విద్యార్థిని అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌నకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందజేస్తోంది. విద్యార్థిని చదువు పూర్తయ్యేంత వరకు 5 ఏళ్లపాటు ఏటా రూ.30,000 ఆర్థికసహాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యార్థిని ద్రాక్షవేణిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందించింది.
స్కూల్ బస్సులు, ఆటోలు సీజ్
గార్ల: స్సెషల్ డ్రైవ్‌లో భాగంగా మండలంలోని ప్రధాన కూడళ్లలో ఆర్టీఓ శంకర్‌నాయక్ గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించి సరైన పత్రాలు లేని 2 స్కూల్ బస్సులు, స్కూల్ పిల్లలను తరలించే 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలను నడిపే ప్రతీఒక్కరు విధిగా ప్రభుత్వ అనుమతి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. దాడుల్లో ఏఎంవీఐలు ఖాసీం, విజయశాంతి, వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


