రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ టోర్నీ ఓవరాల్‌ చాంపియన్‌ వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ టోర్నీ ఓవరాల్‌ చాంపియన్‌ వరంగల్‌

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్‌–17 బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో బాలబాలికల ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను వరంగల్‌ జట్లు కై వసం చేసుకున్నాయి. ఇక రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో ఆదిలాబాద్‌ జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో రంగారెడ్డి 33 పాయింట్లతో చాంపియన్‌ షిప్‌ దక్కించుకోగా, 32 పాయింట్లతో వరంగల్‌ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో 36 పాయింట్లతో కరీంనగర్‌, 29 పాయింట్లతో వరంగల్‌ మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి బహుమతులు అందజేశారు.

పరుగుపందెం, షాట్‌పుట్‌లో...

5వేల మీటర్ల పరుగులో బాలుర విభాగం నుంచి ఓ.అభినయ్‌, మధుకర్‌ (వరంగల్‌), షాట్‌ఫుట్‌లో పి.రవీంద్ర(మహబూబ్‌నగర్‌), టి.అభిలాష్‌(రంగారెడ్డి), బాలికల విభాగంలో ఏ.వినూత్న తేజ(హైదరాబాద్‌), ఎస్‌.సమ్నావిత(వరంగల్‌) ప్రథమ, ద్వితీయస్థానాలు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement