ఖిలా వరంగల్ : దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మా ర్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు మార్కె ట్ బంద్ ఉంటుందని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న నరక చతుర్ధశి, 8న దీపావళి, 9న అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 10వ తేదీన మార్కెట్ కార్యకలా పాలు యథావిధిగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. సెలవు రోజుల్లో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు. మార్కెట్ బంద్ విషయాన్ని రైతులు, వ్యాపారులు, గుమస్తాలు, దడవాయిలు, కార్మికులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
27.6 కిలోల ఎండు
గంజాయి స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీఐ వినయ్‌కుమార్
గూడూరు: వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న 27 కిలోల ఎండుగంజా యి పట్టుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు సీ ఐ వినయ్‌కుమార్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్సై రమేశ్‌బాబు సిబ్బందితో కలిసి కోబల్‌తండా క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కారులో ఓ వ్యక్తి మరో మహిళతో కలిసి రాగా.. వాహనాన్ని సోదా చేశారు. అందులో సుమారు 27.6 కిలోల ఎండు గంజాయి లభించింది. వెంటనే వారితోపాటు కారును స్వాధీ నం చేసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. గూడూరు మండలం భూపతిపేట శివా రు బోడచక్రుతండాకు చెందిన లావుడ్యా దేవి, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ శివారు కోరంకుంట తండాకు చెందిన భూక్య నవీన్ కలిసి కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు నుంచి గంజాయి సేకరించి, హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి అందజేసేందుకు కారులో తీసుకెళ్తున్నట్లు విచారణలో తెలిపారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలి పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.13,82,700 ఉంటుందని వివరించారు.
లారీలకు సీరియల్ ఇవ్వడం లేదని..
● దంపతుల ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి అర్బన్ : బొగ్గు రవాణా కోసం లారీలకు లోకల్ సీరియల్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో లారీ యజమాని దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితులు లారీ యజమాని బి. తిరుపతిరెడ్డి, అనిత దంపతుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటకు చెందిన తిరుపతిరెడ్డి 25 ఏళ్ల క్రితం భూపాలపల్లి మండలం కాసింపల్లి గ్రామానికి చెందిన అనిత వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. రెండు లారీలు కొనుగోలు చేసి బొగ్గు రవాణా చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. స్థానిక లారీ అసోసియేషన్ నుంచి సభ్యత్వం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు ఈ ప్రాంతంలో లారీలకు సరిగా కిరాయి లభించకపోవడంతో వేరే ప్రాంతంలో నడిపించాడు. రెండు నెలల క్రితం తమ లారీలకు భూపాలపల్లి లోకల్ సీరియల్ ఇవ్వాలని ఆ అసోసియేషన్ నాయకులకు దరఖాస్తు చేసుకోగా నిరాకరించారు. ఎందుకు ఇవ్వడం లేదని పలుమార్లు అడిగిన పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గురువారం లారీ అసోసియేషన్ సమావేశం జరుగుతున్న క్రమంలో తి రుపతిరెడ్డి, అనిత దంపతులు వెళ్లారు. మరో సారి లోకల్ సీరియల్ గురించి అడుగగా ఇవ్వమని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురై తమ వెంట తె చ్చుకున్న పెట్రోల్ పోసుకుని దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొందరు గుమస్తాలు చూసి పెట్రో ల్ డబ్బాలు తీసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దంపతులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


