పోలీస్‌ క్రీడాకారులకు ఇంక్రిమెంట్స్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ క్రీడాకారులకు ఇంక్రిమెంట్స్‌

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

హసన్‌పర్తి: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే పో లీస్‌ క్రీడాకారులకు ఇంక్రిమెంట్స్‌ అందజేస్తామని మల్టీజోన్‌–1 ఐజీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ క్రీడా పోటీలు గురువారం ము గిశాయి. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, ఉల్లాసం, క్రమశిక్షణ అవసరమన్నారు. ఇలాంటి పోటీలు సిబ్బందిలో ఐక్యమత్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందిస్తాయన్నారు. పోలీస్‌ కమిషనర్‌ శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్‌ క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని స్ఫూర్తి చాటారని పేర్కొన్నారు. అనంతరం వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, ఖో–ఖో, కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్‌, సెపక్‌ తక్రా తదితర క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, దార కవిత, రాజమహేంద్రనాయక్‌, అడిషనల్‌ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

మల్టీజోన్‌–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి

ముగిసిన రాష్ట్ర స్థాయి పోలీస్‌ క్రీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement