రెవెన్యూ అధికారి పేరుతో రూ. లక్ష మోసం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారి పేరుతో రూ. లక్ష మోసం

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

సంగెం: రెవెన్యూ అధికారినని చెప్పి భూమి రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ. లక్ష మోసం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలి పారు. ఎస్సై కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఎల్గూర్‌స్టేషన్‌ గ్రామానికి చెందిన పాదూరి శారదకు తిమ్మాపూర్‌కు చెందిన వేల్పుల కట్టయ్యతో భూ వివాదాలు ఉన్నాయి. ఈ విషయంపై గత ఆగస్ట్‌, 7వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం అదే నెల 27వ తేదీన వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన చెందిన జక్కి సందీప్‌.. శారద ఇంటికి వచ్చి తాను ఆర్డీఓ కార్యాలయం నుంచి వచ్చిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆమెకు సంబంధించిన 5 ఎకరాల 20 గంటల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పి రూ. లక్ష ఖర్చు అవుతుందని తెలుపగా నమ్మిన బాధితురాలు శారద ఫోన్‌పే ద్వారా ఆ డబ్బు చెల్లించింది. అనంతరం భూమి రిజిస్ట్రేషన్‌ విషయం కోసం అతడిని సంప్రదించగా సందీప్‌ అనే వ్యక్తి రెవెన్యూ ఉద్యోగి కాదని తెలుసుకుని మోసపోయానని గ్రహించింది. సందీప్‌ గతంలో కూడా రెవెన్యూ అధికారిగా, పత్రిక విలేకరిగా చెప్పుకుంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ వివరించారు.

నిందితుడిపై కేసు నమోదు

వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement