ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌

బచ్చన్నపేట: తెలంగాణ సా ధన కోసం పో రాడిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా విస్మరిస్తోందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌ అన్నారు. మండలంలోని కొన్నె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకు న్న తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌గౌడ్‌ చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి సుంకరి మల్లేష్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చిలువేరు రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు నర్రా సంపత్‌, ప్రధాన కార్యదర్శి ముక్కెర కుమారస్వామి, బస్కే రాజేందర్‌, వంగ విఘ్నేశ్వరరావు, బజ్కే రంజిత్‌, ఇమ్మడి వీరస్వామి, స్థానిక ఉద్యమకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement