వరంగల్ అర్బన్: వరంగల్ సిటీపై డ్రోన్ సర్వే, త్రీడీ మ్యాపింగ్‌కు సర్వేపై సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్‌లో వరంగల్ నగరాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుస్థిర, ప్రణాళికాబద్ధ పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీడబ్ల్యూఎంసీ–నిట్ వరంగల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా నగరవ్యాప్తంగా డ్రోన్ సర్వే, త్రీడీ మ్యాపింగ్ చేపట్టే అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్లు శంకర్, శశి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో డ్రోన్ సర్వే నిర్వహణ, త్రీడీ మ్యాపింగ్ రూపకల్పన, సాంకేతిక విధానాలు, అమలు సాధ్యాసాధ్యాలను వివరించారు. ప్రజెంటేషన్‌ను సమీక్షించిన హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ ఐఏఎస్, బల్దియా కమిషనర్ వెంకన్న డ్రోన్ సర్వే, త్రీడీ మ్యాపింగ్ అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఐటీ మేనేజర్ రమేశ్, టౌన్‌ప్లానింగ్ అధికారులు అవినాష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి
హన్మకొండ అర్బన్: రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఏఓ విజయ్ చంద్ర, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, అవినాష్ వర్మ, సాంకేతిక వ్యవసాయ అధికారి కమలాకర్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ రాజగోపాల్‌రావు, డీఈలు, ఎంపీడీఓలు, ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ మహా నగరాభివృద్ధికి
సరికొత్త ముందడుగు
హనుమకొండ కలెక్టర్,
గ్రేటర్ ప్రత్యేకాధికారి చాహత్


