‘గాడిపెల్లి’ ఘనకీర్తి.. | - | Sakshi
Sakshi News home page

‘గాడిపెల్లి’ ఘనకీర్తి..

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

కాళోజీ సెంటర్‌/రాయపర్తి : అంతర్జాతీయ క్రీడా వే దికపై తెలంగాణ కీర్తి చాటుతున్న వరంగల్‌ జిల్లా క్రీడాకారుడు గాడిపెల్లి ప్రశాంత్‌ మరో అరుదైన ఘనత సాధించారు. శ్రీలంకలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న రెండో సౌత్‌ ఏషియన్‌ పారా త్రోబాల్‌ చాంపియన్‌న్‌షిప్‌–2026లో పాల్గొనే భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రశాంత్‌కు ఈ అవకాశం దక్కడం జిల్లా క్రీడా రంగంలో ఆనందం నింపింది. పారా త్రోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్‌ అల్బర్ట్‌ ప్రేమ్‌ కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రశాంత్‌ ఇప్పటికే నాలుగు అంతర్జాతీయ పారా త్రోబాల్‌ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటారు. తొలి ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. రెండో ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ జట్టుకు సారథ్యం వహించి మరో కాంస్య పతకం అందుకున్నారు. తాజాగా మూడోసారి అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం. క్రీడలతోపాటు ఉద్యోగ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న ప్రశాంత్‌.. స్పోర్ట్స్‌ కోటాలో ముంబాయిలోని ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. విధులు నిర్వహిస్తూనే క్రీడా సాధన కొనసాగిస్తూ యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా, ప్రశాంత్‌ను తెలంగాణ క్రీడా సంఘాలు, కోచ్‌ సింగారపు బాబు అభినందించారు. శ్రీలంకలో జరగనున్న చాంపియన్‌ షిప్‌లో ఆయన నాయకత్వంలో భారత జట్టు విజయాలు సాధించి దేశం, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

భారత పారా త్రోబాల్‌ జట్టుకు వరంగల్‌ జిల్లా వాసి ప్రశాంత్‌ సారథ్యం

వరుసగా రెండు ఆసియా చాంపియన్‌షిప్‌లలో కెప్టెన్‌ గా బ్రాంజ్‌ మెడల్స్‌

మూడోసారి భారత జట్టుకు నాయకత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement