హసన్‌పర్తి : కేసుల దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎ స్సై, స్టేషన్ రైటర్లకు కేసుల దర్యాప్తు, కోర్టు విధానాలపై నైపుణ్యం పెంపొందించేందుకు సీపీ కాన్ఫరె న్స్ హాల్‌లో 12రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు బుధవారం ముగియగా సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసుల్లో పకడ్బందీ ఆధారాల సేకరణ, సమర్థంతమైన ప్రాసిక్యూషన్‌తో నిందితులకు శిక్షలు పడేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌కుమార్, దార కవి త, రాజమహేంద్రనాయక్, ఏసీపీలు డేవిడ్‌రాజు, ఏసీపీ సదయ్య, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారులు నిరంతర సాధన, క్ర మశిక్షణ, పట్టుదలతో జాతీయ స్థాయి పోటీల్లో స త్తాచాటి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో గత నెల 26 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించిన ఖే లో ఇండియా రాష్ట్ర స్థాయి మొదటి దశ కోచింగ్ క్యాంపు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులతో మాట్లాడి వారి శిక్షణ, లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్, కోచ్‌లు, క్రీడాకారులు, క్రీడా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ శ్వేత
ఎస్సై, స్టేషన్‌రైటర్లకు శిక్షణ పూర్తి


