ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవాలి

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

హన్మకొండ కల్చరల్‌/హసన్‌పర్తి/కాశిబు గ్గ: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవాలని ధార్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ధర్మమార్గంలో నడవడం ద్వారా జీవితానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. బుధవారం వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయం దగ్గరలోని కీర్తిగార్డెన్స్‌లో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ వరంగల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు. మనిషి జీవితంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ధర్మం, నైతిక విలువలు, సంస్కారం ప్రతీ ఒక్కరు అలవర్చుకోవాలని సూచించారు. ఆర్ష ధర్మ రక్షణ సంస్థ అధ్యక్షుడు నకిరేకంటి రామమూర్తి, కార్యదర్శి పోలా పశుపతి, భద్రకాళి దేవాలయం ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ బండారు శివసుబ్రహ్మణ్యం, ప్రధానార్చకులు భద్రకాళి శేషు పాల్గొన్నారు.

గోశాల, గురుధామం సందర్శన..

చింతగట్టులో నిర్వహిస్తున్న మహర్షి గోశాలను చాగంటి కోటేశ్వరరావు సందర్శించారు. గోశాలలో చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలను పరిశీలించారు. ట్రస్ట్‌ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా వరంగల్‌ ములుగు రోడ్డులోని గురుధామాన్ని చాగంటి కోటేశ్వరరావు సందర్శించి సద్గురు శివానందమూర్తులు ప్రతిష్టించిన శివలింగానికి విశేష పూజలు చేసి, శివానంద మూర్తుల దంపతుల విగ్రహాలకు పుష్పాలు సమర్పించారు. కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు త్రిపురనేని గోపిచంద్‌, సాయి నారాయణ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ధార్మికవేత్త, ప్రవచనకర్త

చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement