కాళేశ్వరం: సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ‘మన మహదేవపూర్’ పేరుతో ఉన్న పబ్లిక్ వాట్సాప్ గ్రూపు హ్యాక్ కావడం స్థానికంగా బుధవారం కలకలం రేపింది. గ్రూపు అడ్మిన్ మండలంలోని మెట్‌పల్లి పంచాయతీలోని మరో వ్యక్తికి అడ్మిన్ హోదా ఇవ్వగా, అతడి ద్వారా గ్రూపులో చేరిన ఓ సైబర్ నేరగాడు వర్జినల్ అడ్మిన్‌ను తొలగించి తానే అడ్మిన్‌గా మారాడు. అనంతరం హర్షసాయి గ్రూపు పేరిట పేదలకు ఆర్థిక సా యం అందిస్తున్నామని, నగదు పంపిస్తే రెట్టింపు చేస్తామని సందేశాలు పోస్ట్ చేశాడు. ముఖ్యంగా రూ.2 వేలు పంపిస్తే వెంటనే అకౌంట్లో రూ.18,500 జమ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహా రాన్ని గమనించిన పలువురు గ్రూపు సభ్యులు అప్రమత్తమై అందులో నుంచి వైదొలిగారు. అయితే ఒకరిద్దరు సభ్యులు డ బ్బులు పంపించి మోసపోయిన ట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపొద్దని, ఇలాంటి సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదని తెలిసింది.
హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూపులో సైబర్ నేరగాళ్లు
పంపిన మెస్సెజ్‌లు
గ్రూపును హ్యాక్ చేసి అడ్మిన్‌ను
తొలగించిన సైబర్ నేరగాడు
రూ.2 వేలు పంపితే రూ.18,500
ఇస్తామంటూ ప్రచారం


