మానుకోటలో దొంగల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మానుకోటలో దొంగల బీభత్సం

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి 5 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదు అపరించుకెళ్లారు. పోలీసులు, బాధిత కుటుంబీకులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రాహుల్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉండే కొవ్వాకుల రమేశ్‌ కుటుంబం పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే రమేశ్‌ దంపతులు మంగళవారం ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లారు. రాత్రి ఇంటికి రాగా తాళాలు పగులగొట్టిన దృశ్యాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా చిందరవందరగా పడి ఉన్న వస్తువులు కనిపించడంతో చోరీ జరిగిందని గుర్తించారు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌ టీంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దొంగలను త్వరితగతిన గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కష్టపడి సంపాదించిన సొమ్మును దొంగలు అపహరించుకెళ్లారని బోరున విలపించారు. జీవితకాల కష్టార్జితం కళ్లముందే దోచుకెళ్లడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

5 తులాల బంగారు, 50 తులాల

వెండి, రూ.5 లక్షల నగదు అపహరణ

రాహుల్‌ నగర్‌ కాలనీలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement