నర్సంపేట రూరల్ : తరగతులు ముగించుకుని కళాశాల నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఓ విద్యార్థి మృత్యుఒడికి చేరాడు. బైక్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన బసిక శ్రీను, కొమురమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ (20) లక్నెపల్లి శివారులోని ఓ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతూ ఇదే గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. ఈక్రమంలో తరగతులు ముగించుకుని కళాశాల నుంచి లక్నెపల్లి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు రిషి, కార్తీక్ కూడా తరగతులు ముగించుకుని బైక్‌పై వరంగల్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో లక్నెపల్లిలో రాజ్‌కుమార్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రిషి, కార్తీక్ రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్సై రాజన్‌బాబు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు నమోదు చేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం తరలించారు. అనంతరం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజన్‌బాబు తెలిపారు.
బైక్ ఢీకొని విద్యార్థి మృతి
ఇద్దరికి తీవ్రగాయాలు
లక్నెపల్లిలో ఘటన


