మక్కలకు రికార్డు ధర రూ.3,177 | - | Sakshi
Sakshi News home page

మక్కలకు రికార్డు ధర రూ.3,177

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

మానుకోట వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని మక్కల రాశులు

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. మంగళవారం రైతులు మార్కెట్‌కు మక్కలు తీసుకురాగా.. క్వింటా ధర రూ.3,177 పలికింది. మక్కల నాణ్యతను బట్టి వ్యాపారులు అధిక ధరలకు కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిసింది. మక్కలకు మంచి ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్‌...

మురసు తుపాను నేపథ్యంలో మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో బుధవారం నుంచి ఈ నెల 9వ తేదీ (సోమవారం) వరకు పత్తి కొనుగోళ్లు బంద్‌ ఉంటాయని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 4నుంచి 9వ తేదీ వరకు కేవలం పత్తి కొనుగోళ్లు మాత్రమే బంద్‌ ఉంటాయని, మిగిలిన సరుకుల క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement