● బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి
కురవి: రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే బీఆర్‌ఎస్‌ను విజయం వరిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్‌హాల్‌లో ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై కురవి, సీరోలు మండలాల ముఖ్యనాయకులు, ఇన్‌చార్జ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో డోర్నకల్ నియోజకవర్గం ముందు వరుసలో ఉందన్నారు. ప్రతీ పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రతీ ఓటరుతో మాట్లాడాలని సూచించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త, నాయకుడు ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరిగిందని, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. అనంతరం రాకేశ్‌రెడ్డి కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, తోట లాలయ్య, గుగులోత్ రవి, ముండ్ల రమేశ్, బోజు నాయక్, విజయ్‌పాల్‌రెడ్డి, మోహన్, దొంగలి నర్సయ్య, కొణతం విజయ్, సంగెం భరత్, నామ సైదులు, గంగాధర్‌రెడ్డి, రాంచంద్రయ్య, గణేశ్, మేక నాగిరెడ్డి, దుడ్డెల వినోద్, సూర్య, గణేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.


