● మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్
మహబూబాబాద్: పట్టణంలో పందుల వల్ల పారిశుద్ధ్య సమస్యతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, పెంపకందారులు అర్థం చేసుకుని వాటిని తరలించాలని మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్ అన్నారు. పందులతో తలెత్తుతున్న సమస్యలపై ఈనెల 2న సాక్షి దినపత్రికలో ‘పందులతో పరేషాన్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితియే. ఈమేరకు కమిషనర్ స్పందించి పెంపకదారులకు నోటీసులు పంపారు. మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలో పందులు కనిపించకుండా చూసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రతను కాపాడడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. పెంపకందారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, శ్రీహరి, పర్యావరణ అఽధికారి గుజ్జు క్రాంతి తదితురులు పాల్గొన్నారు.


