మలక్‌పేట: హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గు రు నిందితులను మలక్‌పేట పోలీసులు మంగళవా రం అరెస్ట్ చేశారు. రూ.7 లక్షల విలువైన 22 సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ కుందూరు వెంకట్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా తాళ్లగడ్డ గ్రామానికి చెందిన కేసరి మణికంఠ అలియాస్ నరమ్‌దాస్ అలియాస్ మున్నా అలియాస్ మణి, వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన నారపోగు వంశీకృష్ణ అలియాస్ నారపాక వంశీకృష్ణ అలియాస్ నల్లి అలి యాస్ వంశీ పాత నేరస్తులు. ఆటోనడుపుతూ సికింద్రాబాద్ అల్ఫా హోటల్ ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నారు. జైలులో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 5 నెలల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బాలాజీనగర్‌కు చెందిన అజయ్‌కుమార్ సికింద్రాబాద్‌లోని అజామ్ మిలన్ గార్మెంట్స్‌లో సేల్స్‌మెన్‌గా చేస్తున్నాడు. మణికంఠ, వంశీకృష్ణ అపహరించిన ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు ఇతని ద్వారా విక్రయించేవారు. ఈక్రమంలో సూర్యాపేటకు చెందిన హేమలత మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం పోచమ్మబస్తీలో స్నేహితులతో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 27న హేమలత చదువుకుంటున్న సమయంలో మణికంఠ ఇంట్లోకి ప్రవేశించి ఆమైపె కత్తి దాడి చేసి సెల్‌ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. సోమవారం గడ్డిఅన్నారం క్రాస్‌రోడ్‌లో టాస్క్‌ఫోర్స్, పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మణికంఠ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. బాధిత మహిళకు చెందిన వన్‌ప్లస్ సెల్‌ఫోన్, వివిధ కంపెనీలకు చెందిన 22 సెల్‌ఫోన్లు, ఒక స్టీల్ కత్తి, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. మలక్‌పేట డీఐ ధర్మారెడ్డి గిరి, క్రైం సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో ఎస్సైలు సంజీవరెడ్డి, తేజ్యానాయక్, రాజశేఖర్‌రెడ్డి, నర్సింహులు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్‌ఓపీఆర్‌యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రఘునందన్
పాలకుర్తి టౌన్: ఓల్డ్ పెన్షన్ రెస్టరేషన్ యునైటెడ్ ఫ్రంట్(ఎన్‌ఓపీఆర్‌యుఎఫ్)జాతీయ ప్రధాన కార్యదర్శిగా పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఆ యన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీఎస్ బదులు పాత పింఛన్ అమలు చేయడంలో పాలకులకు ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఒకే దేశం ఒకే పెన్షన్ అనే విధానం అమలు చేయాలన్నారు. ప్రతీ రాష్ట్రంలో పాత పెన్షన్ పు నరుద్ధరణ కోసం ఉద్యమించేలా ఎన్‌ఓపీఆర్‌యూఎఫ్ కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు.
తుపాన్ ఎఫెక్ట్..
● కేసముద్రం, మానుకోటలో నిలిచిన
కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు
కేసముద్రం/మహబూబాబాద్ రూరల్: మురసు తుపాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకల్లో అంతరాయం తలెత్తింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు కేసముద్రం, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో మంగళవారం గంటల తరబడి నిలిచిపోయింది. ఉదయం 9:30 గంటలకు కేసముద్రం రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిలిచిపోయింది. అలాగే, ఉదయం 9.40 గంటలకు రావాల్సిన రైలు 3 గంటల ఆలస్యంతో 12:43 గంటలకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఖమ్మం, ఆపై రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచి ఉన్న సందర్భంలో కేసముద్రం, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో అధికారులు రైలును నిలిపివేశారు. కాగా, మహబూబాబాద్ నుంచి సాయంత్రం 4.17 గంటలకు అధికారులు రైలును పంపించారు. ఆయా స్టేషన్లలో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


