పత్తి పతనం! | - | Sakshi
Sakshi News home page

పత్తి పతనం!

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో పత్తి పంట ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో క్వింటాకు రూ. 9,250 పైగా ధర పలకగా.. ప్రస్తుతం రూ.8,790కి తగ్గింది. నెల రోజుల్లోనే క్వింటాకు రూ. 600 మేర ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం మార్కెట్‌కు రోజుకు 2వేల బస్తాలకు మించి అమ్మకాలకు రాలేదు. ప్రస్తుతం రైతులు అమ్మకాలు పెంచడంతో మార్కెట్‌కు సుమారు 4వేల బస్తాల పంట చేరుతోంది. అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేని క్రమంలో ధరల పతనం తమకు మరింత భారంగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు.

రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

కాజీపేట: కాజీపేట ఈఎల్‌ఎస్‌ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం రాత్రి రైల్వే ఉద్యోగి దూలం శ్రీనివాస్‌ (45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌ కొద్దిరోజులుగా విధులకు హాజరుకాకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. రామగుండంలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌పై అధికారులు క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

● నెల రోజుల్లో క్వింటాకు

రూ. 600 తగ్గిన ధర

● అమ్మకాలు పెరిగినా

రైతులకు నిరాశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement