పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

● మరిగడి గ్రామంలో ఘటన

జనగామ రూరల్‌: ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పా ముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జనగామ మండలం మరిగడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిన్నింటి పార్వతి (55) అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో పాముకాటుకు గురైంది. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలుపడంతో వారు వెంటనే చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు.

నల్లెలగడ్డ తండాలో మరో మహిళ..

కొడకండ్ల: పాముకాటుతో మండలంలోని గుమ్ములబండ తండా శివారు నల్లెలగడ్డ తండాకు చెందిన మాలోత్‌ సాంకు(55) మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. సాంకు ఆదివారం సాయంత్రం తమ చేనులో పత్తి ఏరుతుండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు కొడకండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు దేవేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement