● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కాజీపేట అర్బన్ : ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఆధ్వర్యంలో మంగళవారం హంటర్‌రోడ్డులోని ‘డీ’ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ పరిచయ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బలపరిచిన సర్వోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ‘కుడా’ చైర్పర్సన్ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


