హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఖానాపురం సెక్షన్ పరిఽధి మంగళవారిపేట సబ్ స్టేషన్‌లో చేసుకున్న మద్యం విందులో ఒక్కరు కాదు.. మొత్తం 8 మంది పాల్గొన్నారు. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం యాజమాన్యానికి నివేదిక అందించింది. దీంతో ఆ ఎనిమిదిపై అధికారులు వేటు వేశారు. ఒక్క సారి ఎనిమిది మందిపై వేటు వేయడం టీజీ ఎన్పీడీసీఎల్‌లో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 29న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్‌లో మద్యం సేవించారు. ఈ విషయం అదే రోజు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. స్పందించిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించగా మూడు రోజులు ఎంకై ్వరీ చేపట్టారు. అప్పటి వరకు లైన్ ఇన్‌స్పెక్టర్ పిట్టల రాజు ఒక్కరే మద్యం సేవించాడని విస్తృత ప్రచారం జరిగింది. విజిలెన్స్ విచారణలో ఒక్కడు కాదు మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను ఎన్పీడీసీఎల్ యాజమాన్యానికి అందించారు. సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ నాగయ్య మద్యం విందు ఏర్పాటు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆయనతో పాటు ఒక లైన్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఏఎల్‌ఎంలు, ఒక సబ్‌స్టేషన్ ఆపరేటర్, ముగ్గురు అన్‌మ్యాన్డ్ వర్కర్లు సబ్ స్టేషన్‌లో మద్యం సేవించినట్లు విచారణలో గుర్తించారు.
విధుల్లో మద్యం సేవించడాన్ని సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం..
విద్యుత్ ప్రమాదకరమైందని తెలిసి కూడా విధుల్లో మద్యం సేవించడాన్ని యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. రెగ్యులేషన్స్ ప్రకారం విధుల్లో ఉంటూ మద్యం సేవించడం క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించడమే అవుతుందని, ఈమేరకు మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత సర్కిల్ ఎస్‌ఈకి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక మేరకు సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ డి.నాగయ్య, లైన్ ఇన్‌స్పెక్టర్ పిట్టల రాజు, ఎల్‌ఎంలు ఎ.రాంచంద్రయ్య, షేక్ బషీర్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ ఎ.ఆనందం ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న రిటైర్డ్ లైన్‌మెన్ చంద్రమౌళిని, ముగ్గురు ఆర్టిజన్లు ఇ.ప్రశాంత్, ఎన్.మురళి, ఆర్.సాయిమల్లును విధుల నుంచి తప్పించారు. కాగా, ఇప్పటికే సిబ్బంది కొరత వేధిస్తుండగా ఒక సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, ఒక లైన్‌ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎఎల్‌ఎంలు, ముగ్గురు అన్‌మ్యాన్డ్ వర్కర్లు విధులకు దూరం కావడంతో ఖానాపురం సెక్షన్‌లో ఉద్యోగుల లోటు నెలకొంది. ఫలితంగా ఉన్న వారిపై మరింత భారం పడునుంది.
మద్యం విందు చేసుకున్న వారిపై వేటు
టీజీ ఎన్పీడీసీఎల్‌లో సంచలనం


