హన్మకొండ అర్బన్ : దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనే ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు హనుమకొండ జేఎన్ఎస్లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పోటీలకు క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక బృందాలు, కోచ్‌లు కలిపి సుమారు 1,500 మంది హాజరయ్యే అవకాశం ఉందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు అంబులెన్స్‌లు, వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని, పో లీస్ శాఖ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. స్టేడియంలోని వేదికకు ఇరువైపులా సీసీ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఏసీపీలు పి. నర్సింహారావు, టి. సత్యనారాయణ, ఆర్అండ్బీ ఈఈ దేవక చవాన్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


