గార్ల: మర్రిగూడెం బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం గార్లకు చేరుకున్న వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించిన రథంపై ప్రతిష్టించి పురవీధుల్లో స్వామివారికి సోమవారం అర్చకులు గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తమ ఇళ్ల ముందుకు వచ్చిన స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి పారవశ్యం పొందారు. ఈ సందర్భంగా గార్ల పట్టణం గోవిందా నామస్మరణలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, వైస్చైర్మన్లు అజ్మీరా బన్సీలాల్, బానోత్ అర్జున, సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, భక్తులు రమేశ్‌బాబు, ఒబిలిశెట్టి కృష్ణ, వేమిశెట్టి శ్రీనివాస్, టీటీడీ ధార్మిక మండలి సభ్యుడు మాలోత్ రాములు, కోట శ్రీనివాస్, బేతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


