కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

మహబూబాబాద్‌: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవఽధిక సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగ సిబ్బంది క్లాత్‌తో తయారు చేసిన తొట్టెలో చిన్నారి బొమ్మను వేసి ఆడించారు. ఆ చిన్నారి బొమ్మను ఉద్దేశించి ‘బాలుడా మీ అమ్మకు 180రోజుల ప్రసూతి సెలవులు లేవు.. ఇన్సూరెన్స్‌ లేదు.. ఉద్యోగ భద్రత లేదు.. సమాన పనికి సమాన వేతనం లేదని’ అంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఉమాకర్‌, నవీన్‌, పవన్‌, అనిల్‌, రాజ్‌కుమార్‌, త్రివేణి, వాణి, వెన్నెల, కల్యాణి, థెరిసా, లావణ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement