పది సంవత్సరాల పాటు దివ్యాంగ పింఛన్ వచ్చింది. మూడు సంవత్సరాల నుంచి రావడం లేదు. కలెక్టరేట్లో పలు మార్లు వినతులు ఇచ్చాను. సంబంధిత అధికారులు పని చేయడం లేదు.
– భూక్య జగ్నా, దివ్యాంగుడు, పీన్యాతండా, నెల్లికుదురు
నాలుగుసార్లు వినతులు ఇచ్చా..
దివ్యాంగ పింఛన్ కోసం రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్న. సదరం సర్టిఫికెట్ ఉంది. కలెక్టరేట్లో నాలుగుసార్లు వినతులు ఇచ్చాను. నా భార్య మంచానికే పరిమితమైంది. భూమిలేదు.. ఇళ్లు లేదు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి.
– బి.అంతయ్య, దివ్యాంగుడు,
వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర


