విషజ్వరంతో బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో బాలుడి మృతి

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

● ఉప్పరపల్లిలో విషాదం

కేసముద్రం: విషజర్వంతో ఓ బాలుడు మృతి చెందాడు. విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మంద మహేశ్‌, ప్రశాంతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రిషి(6) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం (గత నెల 30న) పాఠశాలకు వెళ్లిన ఆ బాలుడు జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే కేసముద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో అదే రోజు సాయంత్రం మానుకోటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా జ్వరం తగ్గకపోవడంతోపాటు ఫిట్స్‌ రావడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు చనిపోవడంతో ఆ చిన్నారి జ్ఞాపకాలను తలుచుకుంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. రిషి మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement