వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి ఆత్మహత్య

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

● వడ్డెకొత్తపల్లిలో ఘటన

పెద్దవంగర : ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలలోని వడ్డెకొత్తపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్‌ కుమార్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాక కొమురయ్య (70) గత నెల 27వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబీకులు గ్రామంతో పాటు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం గ్రామంలోని యాదవ కాలనీ సమీపంలో చెట్ల మధ్య నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా కొమురయ్య చెట్టుకు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘనటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement